యూజర్స్‌కి షాక్ ఇచ్చిన వాట్సాప్‌..

- July 20, 2018 , by Maagulf
యూజర్స్‌కి షాక్ ఇచ్చిన వాట్సాప్‌..

టెక్నాలజీ పరిగెడుతోంది.. దాంతో పాటు యువత కూడా పరిగెడుతోంది. ప్రసుత్తం ఉన్న టెక్నాలజీని వాడుకుని యువత అన్ని రంగాల్లో  దూసుకెళ్తుంది.  అయితే కొంతమంది మాత్రం తల దించుకుని పరిగెడుతున్నారు. మెడలు వంచేసుకుని సెల్ ఫోన్ లోకే చూస్తూ చుట్టూ ఉన్న లోకాన్ని మరచిపోయి మరీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ.. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు. 

ముఖ్యంగా మల్టిపుల్‌ చాట్లకు మెసేజ్‌ను ఫార్వార్డ్‌ చేసుకునేలా వాట్సాప్‌ ఫీచర్‌ను కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున్న మెసేజ్‌లు ఫార్వార్డ్‌  చేస్తూ... నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారు.

అటువంటి తప్పుడు మేసేజ్‌లు వైరల్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో వాట్సాప్‌ సైతం నకిలీ వార్తలు విజృంభించకుండా చూస్తున్నాయి. 

వాట్సాప్‌ మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు పెద్ద మొత్తంలో ఫార్వార్డ్ కాకుండా ఉండేందుకు వాట్సాప్‌ గట్టి చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వాట్సాప్‌లో ఫార్వార్డ్‌ అ‍య్యే టెస్ట్‌పై పరిమితి విధించినట్టు వాట్సాప్‌ ప్రకటించింది. కేవలం ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్‌ ఫార్వార్డ్‌ అయ్యేలా నిర్దేశించింది. అదేవిధంగా మీడియా మెసేజ్‌లకు క్విక్‌ ఫార్వార్డ్‌ బటన్‌ను తీసేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com