ఒమన్‌ అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

- July 20, 2018 , by Maagulf
ఒమన్‌ అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

మస్కట్‌: విలాయత్‌ ఆఫ్‌ సుర్‌లోని ఓ ఇల్లు అగ్ని ప్రమాదం కారణంగా దగ్ధమైనట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ) పేర్కొంది. అయితే అగ్ని ప్రమాదానికి కారణాల్ని మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ వెల్లడించింది. సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఫైర్‌ ఫైటర్స్‌ మంటల్ని అదుపు చేయడంలో సఫలమయ్యారని, ఈ ఘటన సౌత్‌ షక్రియా ప్రావిన్స్‌లో జరిగిందనీ అధికారులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com