ఇండియాలో వాటర్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించిన కువైట్‌ ఫుడ్‌ బ్యాంక్‌

- July 20, 2018 , by Maagulf
ఇండియాలో వాటర్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించిన కువైట్‌ ఫుడ్‌ బ్యాంక్‌

కువైట్‌: కువైట్‌ ఫుడ్‌ బ్యాంక్‌ (కెఎఫ్‌బి), ఇండియాలో వాటర్‌ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. వెల్స్‌ని డిగ్‌ చేయడం ద్వారా క్లీన్‌ వాటర్‌ని అందించడమే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. నీటి ద్వారా సంక్రమించే అనారోగ్యాలకు చెక్‌ పెట్టడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టారు. కెఎఫ్‌బి డైరెక్టర్‌ జనరల్‌ అల్‌ హమార్‌ మాట్లాడుతూ, ఇండియాలో వెల్స్‌ని డిగ్‌ చేసేందుకు డొనేషన్స్‌ స్వీకరించడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పేదలకు తగిన సహాయం అందించే దిశగా ఈ ప్రాజెక్ట్‌ చేపట్టారు. ప్రతి వెల్‌ ఖరీదు 50 కువైటీ దినార్స్‌ అవుతుందని ఆయన వివరించారు. జెయింట్‌ అర్టెసియన్‌ వెల్స్‌ తవ్వించుకోవడం ఖర్చుతో కూడిన పని అనీ, పేదలకు ఇది కష్టంగా మారిందనీ, ఈ నేపథ్యంలోనే ఈ సేవా కార్యక్రమం చేపడడుతున్నామని కువైట్‌ ఫుట్‌ బ్యాంక్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com