కేటీఆర్‌ను కలిసిన మలయాళం మెగాస్టార్!

- July 20, 2018 , by Maagulf
కేటీఆర్‌ను కలిసిన మలయాళం మెగాస్టార్!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ను మ‌లయాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఈ రోజు (శుక్రవారం) క‌లిశారు.  ఈ నెల 25వ తేదీన హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నున్న `కైరాలి పీపుల్ ఇన్నోటెక్ అవార్డుల‌` కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా తెలిపారు కేటీఆర్.

ప్రసుత్తం మమ్ముట్టి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘యాత్ర’ మూవీలో నటిస్తున్నారు.  ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com