19వ ఆసియా మెన్స్‌ యు20 వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌

- July 21, 2018 , by Maagulf
19వ ఆసియా మెన్స్‌ యు20 వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌

మనామా: ప్రపంచంలోనే బిగ్గెస్ట్‌ వాలీబాల్‌ కాంపిటీషన్స్‌కి రంగం సిద్ధమయ్యింది. రిఫ్ఫా స్పోర్ట్స్‌ సిటీలో 19వ ఆసియా మెన్స్‌ అండర్‌ 20 చాంపియన్‌షిప్‌ వాలీబాల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. 24 దేశాలు ఈ పోటీల్లో పాలుపంచుకుంటున్నాయి. వారం రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. ఆసియన్‌ వాలీబాల్‌ కాన్ఫెడరేషన్‌ (ఎడబ్ల్యుసి) ఈ పోటీల్ని నిర్హఇస్తోంది. బహ్రెయిన్‌ వాలీబాల్‌ అసోసియేషన్‌ సహాయ సహకారాలు అందిస్తోంది. బహ్రెయిన్‌ ఒలింపిక్‌ కమిటీ ప్రెసిడెంట్‌, షేక్‌ నాజర్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా నేతృత్వంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇదిలా వుంటే మనామాలోని గోల్డెన్‌ టులిప్‌ హోటల్‌లో జనరల్‌ టెక్నికల్‌ ప్రిపరేటరీ మీటింగ్‌ జరిగింది. టోర్నమెంట్‌కి చెందిన కంట్రోల్‌ కమిటీ ప్రెసిడెంట్‌ సయీద్‌ దరడేరాక్షండే, ఇంటర్నేషనల్‌ రిఫరీ ఛాంగ్‌ చిన్‌ జాంగ్‌, లోకల్‌ ఆగర్గనైజింగ్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జెహాద్‌ ఖల్ఫాన్‌ మరియు పలువురు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com