మేడం టుసాడ్స్‌లో దీపిక

- July 23, 2018 , by Maagulf
మేడం టుసాడ్స్‌లో దీపిక

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌, న్యూదిల్లీలోని ప్రతిష్ఠాత్మక మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మ్యూజియం సిబ్బంది తాజాగా దీపిక కొలతలు తీసుకున్నారు. దీని కోసం ఆమె లండన్‌ వెళ్లారు.

ఈ సందర్భంగా లండన్‌లోని ఓ పత్రికతో దీపిక మాట్లాడుతూ.. 'చాలా ఆతృతగా ఉంది. కృతజ్ఞురాలిగా భావిస్తున్నా. కేవలం సినిమాల ద్వారానే కాకుండా మరో రూపంలో అభిమానుల సంతోషానికి కారణం కావడం చాలా గొప్ప అనుభూతి. ఈ మ్యూజియం చాలా ప్రత్యేకం. నా మైనపు విగ్రహాన్ని చూసి, అభిమానులు ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా. లండన్‌లోని మ్యూజియంను నా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఒక్కసారి చూశా' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com