మేడం టుసాడ్స్‌లో దీపిక
- July 23, 2018
బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. లండన్, న్యూదిల్లీలోని ప్రతిష్ఠాత్మక మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మ్యూజియం సిబ్బంది తాజాగా దీపిక కొలతలు తీసుకున్నారు. దీని కోసం ఆమె లండన్ వెళ్లారు.
ఈ సందర్భంగా లండన్‌లోని ఓ పత్రికతో దీపిక మాట్లాడుతూ.. 'చాలా ఆతృతగా ఉంది. కృతజ్ఞురాలిగా భావిస్తున్నా. కేవలం సినిమాల ద్వారానే కాకుండా మరో రూపంలో అభిమానుల సంతోషానికి కారణం కావడం చాలా గొప్ప అనుభూతి. ఈ మ్యూజియం చాలా ప్రత్యేకం. నా మైనపు విగ్రహాన్ని చూసి, అభిమానులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. లండన్‌లోని మ్యూజియంను నా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఒక్కసారి చూశా' అని అన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!