మూడు భాషలలో అలరించనున్న రాజశేఖర్ తనయ
- July 23, 2018
యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తనయ శివానీ .. 2 స్టేట్స్ తెలుగు రీమేక్‌తో వెండితెర ఎంట్రీ ఇస్తుందనే సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన '2 స్టేట్స్' హిందీ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుంది. దర్శకుడు వెంకట్ కుంచ తెలుగు వర్షెన్‌ని తెరకెక్కిస్తున్నాడు. అడవి శేషు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక తమిళంలోను శివానీ నటిస్తుండగా, ఆ చిత్రం సెట్స్‌పై ఉంది . వీవీ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రంలో విష్ణు విశాల్ జోడీగా నటిస్తుంది శివాని. మధురైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మూవీ రూపొందుతుంది. మరో వైపు మలయాళంలో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ సరసన శివాని నటించనుందనే వార్త వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే తెలుగు, తమిళం, మలయాళ భాషలలో శివానీ హవా ఓ రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!