రెండు డయాబెటిస్‌ మెడిసిన్స్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరణ

- July 23, 2018 , by Maagulf
రెండు డయాబెటిస్‌ మెడిసిన్స్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరణ

మార్కెట్‌ నుంచి బ్లడ్‌ షుగర్‌ని కంట్రోల్‌ చేసే రెండు రకాలైన మందుల్ని ఉపసంహరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులెవరూ ఆ మందుల్ని వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. గ్లైనేజ్‌ 5 ఎంజీ, అలాగే డయాటాబ్‌ 5 ఎంజీ ట్యాబ్లెట్లపై నిషేధం వుంది. హెల్త్‌ కన్సర్న్స్‌ నేపథ్యంలో వీటిపై నిషేధం విదించారు. టైప్‌ 2 డయాబెటిస్‌కి ఈ మందుల్ని ఇప్పటిదాకా వినియోగించారు. ఈ మందు తాలూకు కంపోజిషన్‌పై వివాదాలు వచ్చాయి. సౌదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అథారిటీ ఇటీవలే ఈ ప్రోడక్ట్‌ని మార్కెట్‌ నుంచి ఉపసంహరించడంతోపాటు, వినియోగదారులనూ ఈ మందులు కొనుగోలు చేయొద్దని హెచ్చరించింది. నేషనల్‌ హెల్త్‌ అండ్‌ రెగ్యులేటరీ అథారిటీ తాజాగా ఈ మందులపై నిషేధం ప్రకటించింది. నిషేధించిన మందుల్ని ఎవరైనా విక్రయిస్తున్నట్లయితే మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com