ఉగాండా పార్లమెంటులో మోడీ ప్రసంగం
- July 24, 2018
ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోడీ రువాండలో పర్యటిస్తున్నారు. ఇవాళ అక్కడి నుంచి ఉగాండాకు చేరుకుని ఆ దేశాధ్యక్షుడితో భేటీకానున్నారు. అనంతరం, మోడీ ఉగాండా పార్లమెంటులోనూ ప్రసంగించనున్నారు. బుధవారం దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనలో భాగంగా రువాండలో పర్యటిస్తున్నారు. మొదటి రోజు ఆ దేశాధ్యక్షుడు పాల్ కిగామితో భేటీ ఆయిన మోడీ పలు అంశాలపై చర్చలు జరిపారు. మోడీ, పాల్ పలు అంశాలపై పరస్పర ఒప్పందాలు చేసుకున్నారు. అక్కడి భారత సంతతి పౌరులతో మోడీ సమావేశమయ్యారు. అనంతరం రువాండ దేశాధ్యక్షుడు ఇచ్చిన విందులో మోడీ పాల్గొన్నారు. రువాండలో భారతప్రధాని పర్యటించడం ఇదే మొట్ట మొదటిసారి.
మంగళవారం నుంచి రెండు రోజుల పాటు మోడీ ఉగాండాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉగాండా దేశాధ్యక్షుడు యోవెరి ముసెవెనితో భేటీకానున్న మోడీ.. ఇరు దేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఆ దేశ పార్లమెంటులోనూ మోడీ ప్రసంగిస్తారు. ఉగాండాలో 20 ఏళ్ల తరువాత భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి.
ఈనెల 25 నుంచి 27 వరకు మోడీ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. సౌతాఫ్రికా టూర్ లో భాగంగా మోడీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఆ దేశాధ్యక్షుడుతో కూడా చర్చలు జరుపుతారు. రక్షణ, వాణిజ్య, వ్యవసాయంతో పాటు పలు అంశాలపై ఒప్పందం చేసుకోనున్నారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీకానున్నారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు వాణిజ్యంలో అమెరికా వైఖరితో పాటు ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 27న మోడీ సౌతాఫ్రికా నుంచి తిరిగి భారత్ కు బయలుదేరుతారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..