27న సంపూర్ణ చంద్రగ్రహణం..బ్లడ్ మూన్ గా చంద్రుడు
- July 24, 2018
వాషింగ్టన్: శతాబ్దపు సుదీర్ఘ చంద్రగ్రహణానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రాబోయే శుక్రవారమే ఈ అరుదైన ఖగోళ వింత చోటు చేసుకోనుంది. ఏకంగా గంటా 45 నిమిషాల పాటు భూమి నీడలోకి చంద్రుడు వెళ్లిపోనున్నాడు. కచ్చితమైన గ్రహణం ఏర్పడినపుడు, అదే సమయంలో సూర్యుడి కిరణాలు పడటం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనువిందు చేస్తాడు. దీనిని బ్లడ్ మూన్ అంటారు. ఈ నెలలో కనిపించనున్న రెండో ఖగోళ వింత ఇది. ఇప్పటికే 13వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. 27న సంపూర్ణ చంద్రగ్రహణం, ఆ తర్వాత 31న అరుణ గ్రహం భూమికి దగ్గరగా రానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఇండియా మొత్తం కనిపిస్తుందని అమెచ్చూర్ ఆస్ట్రోనామర్స్ అసోసియేషన్ ఢిల్లీ సభ్యుడు అజయ్ తల్వార్ చెప్పారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా ఉండటం వల్ల సరిగా కనిపించకపోయినా.. సుదీర్ఘ గ్రహణం కావడం వల్ల ఎంతోకొంత చూసే అవకాశం మాత్రం దక్కుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ప్రతిసారి కచ్చితమైన కక్ష్యలోకి రావడం జరగదు. ఎప్పుడో ఒకసారి ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు జరగబోయేది అదే అని బ్రాడ్ టక్కర్ అనే ఆస్ట్రోనామర్ చెప్పాడు. యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికాలలో ఈ సంపూర్ణ సుదీర్ఘ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ఇండియాలో శుక్రవారం రాత్రి 11.54 గంటల తర్వాత ఈ గ్రహణం కనిపించడం ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!