ఈ ఎమిరేట్‌లో ట్రాఫిక్‌ ఫైన్స్‌ నిల్‌

- July 24, 2018 , by Maagulf
ఈ ఎమిరేట్‌లో ట్రాఫిక్‌ ఫైన్స్‌ నిల్‌

అజ్మన్‌ పోలీసులు, ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి ఒకరోజు పూర్తిగా ఎలాంటి జరీమానాలు విధించలేదు. జరీమానాలు విధించడం మానేసి, వాహనదారుల్ని ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై అవగాహన కల్పించేలా చేయగలిగారు. అజ్మన్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్‌ సెక్షన్‌ హెడ్‌ మేజర్‌ ఫౌద్‌ యూసుఫ్‌ అల్‌ ఖైజా మాట్లాడుతూ, 'ఎ డే ఫ్రీ ఆఫ్‌ ట్రాఫిక్‌ ఫైన్‌' పేరుతో గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఉదయం నుంచీ 40కి పైగా పెట్రోల్స్‌ని ఏర్పాటు చేసి, వాహనదారుల్లో ట్రాఫిక్‌ నిబంధనల పట్ల అవగాహన కల్పించామనీ, వాహనదారుల భద్రతపై అవగాహన పెంచే కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. ఇటీవలే అజ్మన్‌ పోలీస్‌, గోల్డెన్‌ పాయింట్స్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని 10 మంది డ్రైవర్స్‌కి రివార్డ్‌ ఇవ్వడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com