అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి

- July 24, 2018 , by Maagulf
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి

అమెరికాలో చదువతున్న మరో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన మీర్జా అహ్మద్‌ అలీ బెయిగ్‌ న్యూయార్క్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నాడు. అక్కడే ఓ మోబైల్‌ స్టోర్‌లోనూ పనిచేస్తున్నాడు. ఈ నెల 21న చివరిసారిగా తమతో మీర్జా అహ్మద్‌ అలీ బెయిగ్‌ మాట్లాడాడని హైదరాబాద్‌లో ఉంటున్న అతని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వత నుంచి అతనికి ఫోన్‌ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. 26 ఏళ్ల అలీ.. 2015 నుంచి అమెరికాలోనే ఉంటున్నాడు. హైదరాబాద్‌లోనే ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అలీ.. మాస్టార్స్‌ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com