సెప్టెంబర్‌లో ప్రారంభానికి సిద్ధమవుతున్న సోహార్ డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్
- July 24, 2018
మస్కట్: సోహార్‌లో నిర్మాణంలో వున్న డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ పనులు 97 శాతం పూర్తయ్యాయి. 1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో దీన్ని నిర్మిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సోహార్ మునిసిపాలిటీతో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టింది. ఈ ఏడాది చివరి క్వార్టర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతంగా చేస్తున్నారు. సెప్టెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందనీ, అదే నెలలో ప్రారంభం కాబోతోందని అధికారులు పేర్కొన్నారు. సోహార్ మునిసిపాలిటీ, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ంటర్నల్ ఎక్విప్మెంట్ని అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 1,611,100 ఒమన్ రియాల్స్. ఆర్పిక్, సోహార్ అల్యూమినియం మరియు వేల్ కంపెనీస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకుంటున్నాయి. 3,502.16 చదరపు మీటర్ల వైశాల్యంలోని ఈ సెంటర్, డ్రగ్ డిపెండెంట్స్‌కి సేవలందిస్తుంది. డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్ప్రరిణామాలపై ప్రచారం చేస్తుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!