హిట్ లిస్ట్ లో ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్
- July 25, 2018
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక బృందం పోలీసులు (సిట్) మడికేరీలో రాజేష్ (50) అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకూ గౌరీ లంకేష్ హత్య కేసులో సిట్ అధికారులు 11 మందిని అరెస్టు చేశారు.
మూడు రోజుల క్రితం హుబ్బళిలో గణేష్ విస్కీన్, అమిత్ రామచంద్ర బడ్డి అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిద్దరూ అక్రమంగా మారణాయుధాలు పెట్టుకున్నారని, గౌరీ లంకేష్ హత్యకు వీరే మారణాయుధాలు సరఫరా చేశారని సిట్ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఓ నిందితుడి దగ్గర ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులోని విషయాలు తెలుసుకున్న సిట్ అధికారులు షాక్ కు గురైనారు. డైరీలో మొత్తం 34 మంది పేర్లు హిట్ లిస్ట్ లో ఉన్నాయని వెలుగు చూసింది.
డైరీలోని హిట్ లిస్ట్ లో గౌరీ లంకేష్ పేరు నెంబర్ 2 గా ఉందని, హిట్ లిస్ట్ లో ప్రముఖ నటుడు, సాహితీవేత్త గిరీష్ కర్నాడ్ (శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి తండ్రిగా నటించిన వ్యక్తి) పేరు నెంబర్ 1 గా ఉందని సిట్ అధికారులు గుర్తించారు.
హిందూ ధర్మాలను వ్యతిరేకిస్తున్న కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న 34 మందిని హత్య చెయ్యాలని వీరు ప్లాన్ వేశారని సిట్ అధికారుల విచారణలో వెలుగు చూసింది. డైరీలో పేర్లు ఉన్న వ్యక్తుల గురించి స్థానిక పోలీసులకు కర్ణాటక సిట్ అధికారులు సమాచారం ఇచ్చి వారిని అలర్ట్ చేశారు. గిరీష్ కర్నాడ్ కు కర్ణాటక పోలీసులు గట్టి భద్రత కల్పించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!