అర్జున్ రెడ్డి తమ్ముడు.. దొరసానితో లవ్..!
- July 25, 2018
పెళ్లిచూపులు కంటే ముందు ఎవడే సుబ్రమణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ హీరోగా తొలి సినిమా పెళ్లిచూపులుతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే అర్జున్ రెడ్డి వచ్చే సరికి మనోడికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువైంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది.
ఇక ప్రస్తుతం గీతా గోవిందం సినిమాతో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. అతని ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే విజయ్ తమ్ముడు ఆనంద్. కొన్నాళ్లుగా ఆనంద్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తుండగా ఇప్పుడు అది కన్ ఫాం అయ్యింది. సురేష్ బాబు నిర్మాణంలో చిన్న బడ్జెట్ సినిమాగా వస్తున్న సినిమాలో ఆనంద్ నటిస్తాడట.
మహింద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు దొరసాని అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఇక ఇందులో మరో సర్ ప్రైజ్ ఏంటంటే యాంగ్రీ యంగ్ మెన్ డా. రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఈమధ్యనే రాజశేఖర్ పెద్ద కూతురు శివాని హీరోయిన్ గా అడవి శేష్ తో సినిమా సైన్ చేసింది.
ఇక ఇప్పుడు రాజశేఖర్ ఫ్యామిలీ నుండి మరో హీరోయిన్ వస్తుంది. సురేష్ బాబు ప్రొడక్షన్ కాబట్టి సినిమాకు మంచి పబ్లిసిటీ దొరుకుతుంది. మరి అర్జున్ రెడ్డి అదేనండి మన విజయ్ దేవరకొండ తమ్ముడు కూడా హీరోగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!