బీచ్‌లో స్విమ్మింగ్‌పై నిషేధం!

- July 25, 2018 , by Maagulf
బీచ్‌లో స్విమ్మింగ్‌పై నిషేధం!

మస్కట్‌: మునిసిపల్‌ అథారిటీస్‌, ఓ బీచ్‌లో స్విమ్మింగ్‌పై నిషేధం విధించారు. సుర్‌ అల్‌ సఫ్నాత్‌ ప్రాంతంలోని సీబ్‌ బీచ్‌లో స్విమ్మింగ్‌ ప్రమాదకరమనే నిర్ణయానికి వచ్చిన అధికారులు, బీచ్‌లో స్విమ్మింగ్‌పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ప్రమాదకరమైన టర్బ్యులెంట్‌ వాటర్స్‌ కారణంగా, స్విమ్మర్స్‌ మృత్యువాత పడే అవకాశం వుందనే, ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. బీచ్‌కి వెళ్ళేవారు ఈ హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ సీబ్‌ బీచ్‌లో స్విమ్మింగ్‌ చేయరాదని హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com