ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన డైరెక్టర్ మణిరత్నం
- July 26, 2018
ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. తెలుగు, తమిళంలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను రూపొందించిన మణిరత్నం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గీతాంజలి, రోజా, బొంబాయి, నాయకుడు సహా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయే అనేక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి సుహాసినిని ఆయన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు 63 ఏళ్లు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మణిరత్నం త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘చెక్క చీవంత వాణం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘నవాబ్’ టైటిల్‌తో విడుదల కాబోతోంది. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, సింబు, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!