ఈ నెల 29న 'గీత గోవిందం' ఆడియో విడుదల
- July 26, 2018విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న జంటగా సోలో ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో రాబోతున్న చిత్రం గీత గోవిందం. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఓ రేంజ్ పెరిగిందనడానికి ఇటీవల వచ్చిన గీత గోవిందం టీజర్స్ కు వ్యూస్ చెపుతున్నాయి. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణం లో ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఈ ఆడియో వేడుకకు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. ఈ చిత్రానికి గోపిసుందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇంకేం కావాలి అంటూ గోపీసుందర్ ఇచ్చిన ట్యూన్ అదిరిపోయింది. దీంతో గీత గోవిందం సాంగ్స్ అదిరిపోయాయని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మెహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు నటిస్తుండగా, శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ తర్వాత పరుశురాం నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.
ప్రొడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA2 PICTURES బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల