కాలిఫోర్నియా:అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు
- July 27, 2018అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా అటవీప్రాంతంలో మంటలు చెలరేగి ఉదృతరూపం దాల్చాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా …. పలు ఇళ్లు, వ్యాపార సముదాయాలు కాలిపోయాయి. వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఆప్రాంతంలో విద్యుత్, రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఇప్పటివరకు 28వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్నికీలలు వేగంగా దూసుకొస్తుండటంతో సమీపంలో నివాసమున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వైల్డ్ ఫైర్ కారణంగా స్థానికులతోపాటు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని కాలిఫోర్నియా అగ్నిమాపక శాఖ ప్రతినిధి స్కోట్ మెక్ లిన్ తెలిపారు. 17వందల అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు