బ్లడ్‌ మూన్‌ ఎక్లిప్స్‌: పులకించిన యూఏఈ రెసిడెంట్స్‌

- July 27, 2018 , by Maagulf
బ్లడ్‌ మూన్‌ ఎక్లిప్స్‌: పులకించిన యూఏఈ రెసిడెంట్స్‌

దుబాయ్‌, అలాగే సమీప ప్రాంతాల్లోని ప్రజలు బ్లడ్‌ మూన్‌ ఎక్లిప్స్‌ని తిలకించారు. దుబాయ్‌ ఆస్ట్రానమీ గ్రూప్‌ లైవ్‌ వీడియో ఫీడ్‌ ద్వారా మొత్తం గ్రహణ ప్రక్రియను చూసే అవకాశం కల్పించింది. అర్థరాత్రి ఈ టోటల్‌ లూనార్‌ ఎక్లిప్స్‌ చోటు చేసుకుంది. యూఏఈ వ్యాప్తంగా పలు చోట్ల ఆస్ట్రానమీ సెంటర్స్‌లో అబ్జర్వేషన్‌ పాయింట్స్‌ని యూఏఈ స్పేస్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసింది. ఈ శతాబ్దానికే ఇది అత్యంత సుదీర్ఘమైన లూనార్‌ ఎక్లిప్స్‌. అబుదాబీలోని ఇంటర్నేషనల్‌ ఆస్ట్రనామికల్‌ సెంటర్‌, ఎమిరేట్స్‌ మొబైల్‌ అబ్జర్వేటరీ, అల్‌ సదీమ్‌ ఆస్ట్రానమీ, షార్జా సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌, దుబాయ్‌ ఆస్ట్రానమీ గ్రూప్‌ ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com