వైభవంగా సాగుతున్న లష్కర్ బోనాల జాతర

- July 29, 2018 , by Maagulf
వైభవంగా సాగుతున్న లష్కర్ బోనాల జాతర

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్‌లో బారులు తీరారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని హారతి ఇచ్చి తొలిబోనంను సమర్పించారు. బోనాలకు భారీ ఏర్పాట్లు చేశామని.. భక్తులు సహకరించాలని కోరారు. నిజామాబాద్ ఎంపీ కవిత మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున బంగారు బొనం సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు కూడా సతీసమేతంగా ఆలయానికి విచ్చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
కాగా ఉజ్యయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. వీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖులు గుడికి వచ్చే అవకాశాలు ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ అంశాలు విధించారు. 3 వేల మంది సిబ్బంది, అడుగడుగునా సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. కాగా జాతరలో ప్రధాన ఘట్టం రంగం సోమవారం వైభవంగా జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com