ఆగస్ట్ తొలివారం నుంచి వెంకటేష్ రెగ్యూలర్ షూటింగ్..
- July 30, 2018వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'వెంకీ మామ' చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 8 నుంచి జరుగుతుంది.
ప్రేమమ్ చిత్రంలో నాగ చైతన్య మావయ్య వెంకటేష్ చిన్న గెస్ట్ రోల్లో కనిపించాడు.. ఇప్పుడు తాజాగా ఈ మామ అల్లుళ్లు కలసి ఒక మూవీ చేయనున్నారు.. జై లవ కుశ మూవీ తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది.. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..పూర్తి కామెడీ చిత్రంగా రూపొందే ఇందులో వెంకీ సరసన హ్యూమా ఖురేషి నటిస్తుండగా, చైతూకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తొలి షెడ్యూల్ ను పొలాచ్చిలో తీయనున్నారు.. దీని కోసం ఆగస్ట్ తొలివారంలో వెంకీ, చైతూ తో పాటు చిత్ర యూనిట్ పొలాచ్చికి బయలుదేరనుంది. అక్కడ 8వ తేది నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరపనున్నారు. కాగా ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడని అనుకున్నారు.. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి డిఎస్పీ తప్పుకున్నట్లు సమాచారం..
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం