అబుదాబీలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
- July 30, 2018
అబుదాబీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 44 మంది గాయపడ్డారు. ఓ బస్సు, మరో రెండు వాహనాలు అల్ షవామెక్ బ్రిడ్జిపై ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వున్నపళంగా వాహనాన్ని టర్న్ చేయడం, తగినంత గ్యాప్ పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఉదయం 7.30 ఇమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్‌కి ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందింది. పోలీస్ పెట్రోల్స్, అంబులెన్సెస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని హుటాహుటిన అల్ రహ్బా మరియు ముఫ్రాఖ్ హాస్పిటల్స్‌కి తరలించారు. వాహనదారులు తమ వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, రోడ్ రూల్స్ పాటించాలనీ అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







