మెక్సికోలో కూలిన విమానం

- July 31, 2018 , by Maagulf
మెక్సికోలో కూలిన విమానం

మెక్సికోలోని డ్యురాంగో రాష్ట్రంలో విమానంలో కూలిపోయింది. ఈ ఘటనలో 85 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 2.30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలు) సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఈ విమానంలో సిబ్బంది సహా 101 మంది ప్రయాణిస్తున్నారని ఆ రాష్ట్ర గవర్నర్ ట్వీట్ చేశారు.

ఎయిరోమెక్సికోకు చెందిన ఎఎమ్2431 విమానం గ్వాడలూపె విక్టోరియా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి మెక్సికో నగరానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే విమానం కూలిపోయింది. వాతావరణం సరిగా లేకపోవడమే దీనికి కారణం కావచ్చని తెలుస్తోంది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో భారీ వర్షం కురుస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బలమైన గాలులు విమానాన్ని ఢీ కొట్టినట్లు అనిపించిందని ఒక ప్రయాణికుడు వెల్లడించారు. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగినా, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు వాటిని ఆర్పేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com