భారతీయ వలసదారుడి మృతి
- July 31, 2018
కేరళకు చెందిన ఓ వ్యక్తి అబుదాబీలో మృతిచెందారు. రెండు నెలలుగా అతని ఆచూకీ దొరకలేదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. జూన్ 19న సముద్రంలో మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడ్ని మొయిదీన్న్గా గుర్తించారు. మార్చి నెలలో మొయిదీన్ ఉద్యోగం కోల్పోయారనీ, ముస్సాఫాలోని ఓ వర్క్ షాప్లో అప్పటిదాకా పనిచేశారనీ, మార్చిలో ఆ కంపెనీ మూతపడిందనీ అతని సన్నిహితులు పేర్కొన్నారు. మొయిదీన్ నుంచి కొంతకాలంగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. రమదాన్ సందర్భంలో మొయిదీన్తో మాట్లాడినట్లు మృతుడి బంధువు చెప్పారు. మొయిదీన్కి సంబంధించిన సమాచారం కోసం కొన్ని వారాలుగా ప్రయత్నిస్తున్న తాను, సోషల్ మీడియాలో తనకు తెలిసిన వివరాల్ని ప్రచారం చేశాననీ, వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తామని సోషల్ వర్కర్ ఎంఎం నాజర్ కహన్గాద్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







