రెండో స్థానంలో హువ్వావే
- August 01, 2018
అమెరికాకి చెందిన అగ్రశ్రేణి టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన స్థానం కోల్పోయింది. చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ హువావీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. జూన్ తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ప్రపంచంలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు అమ్మిన రెండో కంపెనీగా హువావీ అవతరించింది. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న యాపిల్ మూడో స్థానానికి పడిపోయింది. యూరప్, చైనాలో విస్తరించడంతో హువావీ ఈ ఫీట్ సాధించింది. మొదటి స్థానంలో కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన స్థానాన్ని కాపాడుకోగలిగింది.
ప్రపంచ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ చైనాలో కొద్ది కాలంగా మందగించిన అమ్మకాలు తీరిగి పుంజుకున్నాయి. దీంతో స్వదేశంలో హువావీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జోరుగా సాగాయి. దీనికి తోడు ఫీచర్ ఫోన్ల అమ్మకాల్లో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది హువావీ. ఇటీవల మూడు కెమెరాలతో మార్కెట్లో ప్రవేశపెట్టిన హువావీ పీ20 ప్రో స్మార్ట్ ఫోన్ ఇతర కంపెనీల మార్కెట్ ను కొల్లగొట్టిందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2018 మొదటి అర్థభాగంలో 15 శాతం అధికంగా ఆదాయం ఆర్జించినట్టు హువావీ తెలిపింది.
ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో హువావీ ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 15 శాతాని కంటే ఎక్కువ భాగాన్ని సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే కాలంలో యాపిల్ దాదాపుగా 12 శాతం మార్కెట్ మాత్రమే దక్కించుకోగలిగింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సుమారు 20 శాతం మార్కెట్ షేర్ సాధించింది. అయితే అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలు హువావీ స్మార్ట్ ఫోన్ల ద్వారా చైనా ప్రభుత్వం గూఢచర్యం జరుపుతోందని ఆరోపించాయి. దీంతో ఆయా దేశాల్లో మార్కెట్ కోల్పోతున్న దృష్ట్యా హువావీకి చైనా మార్కెట్ ఎంతో కీలకంగా మారింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!