'నరకాసురుడు' ట్రైలర్ అదుర్స్
- August 01, 2018
అరవింద్ స్వామి, శ్రీయ, సందీప్ కిషన్, ఇంద్రజిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'నరగాసూరన్'(నరకాసురుడు). పాంటసీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో అరవింద్ స్వామి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.
అరవింద్ స్వామి భార్య పాత్రలో హీరోయన్ శ్రీయ నటించింది. ఆమెకు సంబంధించిన ఇష్యూ చూట్టూ సినిమా నడుస్తుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ట్రైలర్ కట్ చేసిన తీరు సైతం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దర్శకుడు కార్తీక్ నరేన్ మీద అరవింద్ స్వామి పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఇంతకు ముందు ఓ సారి కార్తీక్ నరేన్ గురించి మాట్లాడుతూ.... మన సినిమా స్థాయిని హాలీవుడ్ లెవల్‌కి తీసుకెళ్లే సత్తా ఉన్నోడు అంటూ హాలీవుడ్ దర్శకుడు నైట్ శ్యామలన్తొ పోల్చాడు.
ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి తర్వాత కీలకమైన పాత్రలో సందీప్ కిషన్ నటించాడు. నరగాసూరన్ గురించి అన్వేషించే పాత్రలో అతడు నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.
నరగాసూరన్ చిత్రాన్ని తెలుగులో 'నరకాసురుడు' పేరుతో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ ఖరారు చేయబోతున్నారు. 'ధృవ' సినిమాతో మళ్లీ తెలుగులో మంచి ఇంప్రెషన్ కొట్టేసిన అరవింద్ స్వామికి తోడు సందీప్ కిషన్ కూడా ఉండటంతో టాలీవుడ్‌లోనూ ఈ మూవీ బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!