విజయవాడ:రేపు ఆస్ట్రేలియా అడ్మిషన్స్‌ డే

- August 01, 2018 , by Maagulf
విజయవాడ:రేపు ఆస్ట్రేలియా అడ్మిషన్స్‌ డే

విజయవాడ: ఏఈసీసీ గ్లోబల్‌ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ తేదీన ఎంజీ రోడ్డులోని ఫార్చ్యూన్‌ మురళీ పార్కు హోటల్‌లో ఆస్ట్రేలియా అడ్మిషన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు ఏఈసీసీ ఏపీ బిజినెస్‌ హెడ్‌ చైతన్య వాడపల్లి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి 20 విశ్వవిద్యాలయాలు పాల్గొంటాయని తెలిపారు. ఒకే రోజు వారందరినీ విద్యార్థులు కలుసుకుని వారి స్పాట్‌ అసెస్‌మెంట్‌, ట్యూషన్‌ ఫీజులు, స్కాలర్‌షిప్స్‌ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎటువంటి రుసుములు, ప్రాసెసింగ్‌ ఫీజులు లేకుండా నిర్వహించే ఈ సమ్మిట్‌లో క్వాలిఫైడ్‌ కౌన్సిలర్స్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. అర్హులైన, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 89787 87855 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com