ఆమ్నెస్టీ: అనుమతి వచ్చాక 10 రోజులు వేచి చూడాల్సిందే

- August 03, 2018 , by Maagulf
ఆమ్నెస్టీ: అనుమతి వచ్చాక 10 రోజులు వేచి చూడాల్సిందే

యూ.ఏ.ఈ:ఆమ్నెస్టీ సందర్భంగా ఎగ్జిట్‌ పర్మిట్‌ దొరికినా, మరో పది రోజులు వేచి చూడాల్సి వుంటుందని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ (జిడిఆర్‌ఎఫ్‌ఎ) అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆగస్ట్‌ 2న ఔట్‌ పాస్‌ లభిస్తే, ఆగస్ట్‌ 12న మాత్రమే తన స్వదేశానికి ఆమ్నెస్టీ పొందిన వ్యక్తి వెళ్ళేందుకు వీలుంది. 10 రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌, ఆ వ్యక్తి పేరుని సిస్టమ్‌లో క్లియర్‌ చేసేందుకోసం పడుతుందని జిడిఆర్‌ఎఫ్‌ఎ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫాలో అప్‌ సెక్టార్‌ ఆఫ్‌ వయోలేటర్స్‌ అండ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ బ్రిగేడియర్‌ ఖలాఫ్‌ అల్‌ ఘయిత్‌ చెప్పారు.ఆమ్నెస్టీ పొందినవారు వెంటనే టిక్కెట్‌ కొనుగోలు చేయవచ్చుననీ, అయితే వారు 10 రోజుల తర్వాత మాత్రమే ప్రయాణించాల్సి వుంటుందని అల్‌ ఘయిత్‌ స్పష్టం చేశారు. ఎమర్జన్సీ కేసులకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా వుంటాయని ఆయన చెప్పారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com