మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ

- August 04, 2018 , by Maagulf
మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ

ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుతో సహా 10 అంశాలను ప్రధాని మోడి ముందు ఉంచారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మధ్యాహ్నం మోడీతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన 10 అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హైకోర్టు విభజన, తెలంగాణలో కొత్త జోన్ల ఏర్పాటు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయహోదా, విభజన హామీల అమలుపై చర్చించారని సమాచారం.

కేంద్రం ఏపీకి నిధులు విడుదల చేస్తున్నా.. తెలంగాణకు నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్‌ కోరినట్టు తెలుస్తోంది. ఐఏఎం, ఐపీఐఆర్, కరీంనగర్‌లో ట్రిబుల్ ఐటీ, అలాగే కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థపై కేంద్ర ఆమోదం లాంటి అంశాలపై కేసీఆర్‌ వినతి పత్రాలు అందించారు.

నిన్న కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కూడా కేసీఆర్‌ కలిశారు. దాదాపు గంట సేపు రవిశంకర్‌ప్రసాద్‌‌తో కేసీఆర్‌ చర్చలు జరిపారు. జోనల్‌ వ్యవస్థకు సత్వరమే ఆమోదముద్ర వేయాలని కేసీఆర్‌ కోరారు. జోనల్‌ వ్యవస్థ ఆవశ్యకతను రవిశంకర్‌ప్రసాద్‌కు వివరించారు. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామని, జోనల్‌ వ్యవస్థ వల్ల యువతకు ఎక్కువ అవకాశాలు వస్తాయని కేసీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. హైకోర్టు విభజన, ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌, రిజర్వేషన్ల అంశాన్ని రవిశంకర్‌ప్రసాద్‌ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com