రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

- August 04, 2018 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

మస్కట్‌:అల్‌ వుస్తాలో ఓ కారు ప్రమాదానికి గురికావడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం మరింత విషాదకరం. మృతి చెందినవారంతా ఎమిరేటీలేనని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. తండ్రి, గ్రాండ్‌ మదర్‌, ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో చనిపోయారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా యూఏఈకి చెందినవారు. అల్‌ జమామిమ్‌ ప్రాంతంలో రెండు కార్లు ప్రమాదానికి గురయ్యాయనీ,ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారనీ, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించడం జరుగుతోందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com