మోదీతో ముగిసిన కేసీఆర్ భేటీ
- August 04, 2018
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుతో సహా 10 అంశాలను ప్రధాని మోడి ముందు ఉంచారు తెలంగాణ సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం మోడీతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన 10 అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హైకోర్టు విభజన, తెలంగాణలో కొత్త జోన్ల ఏర్పాటు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయహోదా, విభజన హామీల అమలుపై చర్చించారని సమాచారం.
కేంద్రం ఏపీకి నిధులు విడుదల చేస్తున్నా.. తెలంగాణకు నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది. ఐఏఎం, ఐపీఐఆర్, కరీంనగర్లో ట్రిబుల్ ఐటీ, అలాగే కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థపై కేంద్ర ఆమోదం లాంటి అంశాలపై కేసీఆర్ వినతి పత్రాలు అందించారు.
నిన్న కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కూడా కేసీఆర్ కలిశారు. దాదాపు గంట సేపు రవిశంకర్‌ప్రసాద్‌తో కేసీఆర్ చర్చలు జరిపారు. జోనల్ వ్యవస్థకు సత్వరమే ఆమోదముద్ర వేయాలని కేసీఆర్ కోరారు. జోనల్ వ్యవస్థ ఆవశ్యకతను రవిశంకర్‌ప్రసాద్‌కు వివరించారు. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామని, జోనల్ వ్యవస్థ వల్ల యువతకు ఎక్కువ అవకాశాలు వస్తాయని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. హైకోర్టు విభజన, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, రిజర్వేషన్ల అంశాన్ని రవిశంకర్‌ప్రసాద్ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







