డొమెస్టిక్ జర్నీలపై గో ఎయిర్ ఎయిర్లైన్స్ భారీ ఆఫర్‌

- August 04, 2018 , by Maagulf
డొమెస్టిక్ జర్నీలపై గో ఎయిర్ ఎయిర్లైన్స్ భారీ ఆఫర్‌

గో ఎయిర్ సంస్థ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్స్ సేల్‌ పథకంలో దేశీయ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. తన నెట్‌వర్గ్‌ అంతటా దాదాపు లక్ష టికెట్లను ఈ తగ్గింపు ధర ఆఫర్‌లో విక్రయించాలని ప్లాన్‌ చేసింది. 1099 (అన్నీ పన్నులు కలిసిన) రూపాయల ప్రారంభ ధర వద్ద వన్‌వే విమాన టికెట్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌లో టికెట్‌ బుకింగ్‌ నేటి(ఆగస్టు 4,శనివారం) నుంచి మొదలై ఆగస్టు 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 4 నుంచి డిసెంబరు 31 దాకా ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com