హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- August 04, 2018
హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు రాత్రి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లోనే బసచేయనున్నారు. ఆదివారం రాష్ట్రపతి నిలయంలో జరిగే హరితహారంలో పాల్గొంటారు. అనంతరం ఆదివారం ఉదయం 10:30గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో మొక్కలు నాటనున్నారు. ఆ తరువాత సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవానికి హాజరవుతారు. ఆదివారం మధ్యాహ్నం చెన్నై వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







