గీతా ఆర్ట్స్ బేనర్‌లో నటించనున్నమెగా హీరోలు
- August 07, 2018
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బేనర్‌పై ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల గీతా ఆర్ట్స్ 2 అనే సంస్థని స్థాపించి ఇందులో చిన్న సినిమాలు చేస్తున్నాడు. తాజాగా గీత గోవిందం అనే చిత్రం గీతా ఆర్ట్స్2 బేనర్‌పై రూపొందగా, ఈ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కట్ చేస్తే అల్లు అరవింద్ రానున్న రోజులలో తన బేనర్‌పై ముగ్గురు మెగా హీరోలతో మూడు డిఫరెంట్ ప్రాజెక్టులు చేయనున్నట్టు తెలిపాడు. చిరంజీవి, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ హీరోలుగా అల్లు అరవింద్ క్రేజీ ప్రాజెక్టులు చేయనుండగా, చిరు సినిమా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్, వరుణ్ తేజ్ సినిమాలకి సంబంధించిన క్లారిటీ రావలసి ఉంది. చిరు ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉండగా, వరుణ్ తేజ్ ఎఫ్2 చిత్రంతో పాటు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడు అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







