డార్జిలింగ్ షూటింగ్ పూర్తి చేసిన తలైవా
- August 07, 2018
కబాలి , కాలా చిత్రాలతో అభిమానులను , ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసిన సూపర్ స్టార్ రజనీకాంత్..ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డార్జిలింగ్ షెడ్యూల్ పూర్తి చేసినట్లు సమాచారం. సుమారు 25 రోజుల పాటు చిత్ర యూనిట్ డార్జిలింగ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం లో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట.
ఇక ఈ మూవీ లో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి , బాబీ సింహ వంటి ప్రముఖ నటులు నటిస్తుండగా , సీనియర్ సౌత్ హీరోయిన్ సిమ్రాన్ తో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరాబోతున్నారు. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని రజనీ భావిస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







