అరబిక్ స్టయిల్ చికెన్ కర్రీ
- August 10, 2018కావల్సినవి: బోన్‌లెస్, స్కిన్లెస్ చికెన్(ముక్కలుగా కట్చేసినది) - 1కె.జి, నూనె - 4-5 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు(పొట్టుతీసి ముక్కలుగా కట్చేసుకున్నవి) - 2
వెల్లుల్లి రేకలు - 4, , అల్లం ముద్ద - 1 టేబుల్‌స్పూన్, పసుపు - 1 టేబుల్‌స్పూన్, పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినది), ఆల్మండ్స్ - 1/2 కప్పు, ఎండుద్రాక్ష - 1/2 కప్పు
టమాట(ముక్కలుగా కట్చేసుకున్నవి) - 4, నిమ్మరసం- రుచికితగినంత, నీళ్లు- చికెన్‌ను ఉడికించేందుకు సరిపోయేఅన్ని, ఉప్పు- రుచికి తగినంత
విధానం:
చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్‌పాన్‌లో నూనెవేసి వేడిచేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించుకోవాలి. తర్వాత ఆల్మండ్స్, అల్లం, పసుపు, కారంపొడి, పచ్చిమిర్చి వేసి నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. దీనికి ఎండుద్రాక్ష, టమాటో, నిమ్మరసం, కప్పు నీరు కలిపి సన్నని సెగమీద ఉడికించాలి. తగినంత ఉప్పువేసి ఐదు నిమిషాలు ఉంచి దించుకోవాలి. వేడివేడి అన్నంతో ఈ కర్రీని వడ్డించడమే తరువాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు