ఆగష్టు 17న విడుదల కానున్న "ఝాన్సీ"

- August 11, 2018 , by Maagulf
ఆగష్టు 17న విడుదల కానున్న

జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 'నాచియార్' చిత్రం తమిళంలో విడుదలై భారీ విజయం సాధించి.. ఇప్పుడు తెలుగులో 'ఝాన్సీ' పేరుతో విడుదలకు సిద్ధంగా ఉంది. కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా ఆగష్టు 17న ఈ చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సంచలన దర్శకుడు బాల తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. విక్రమ్ నటించిన 'సేతు', సూర్య నటించిన 'నందా', సెన్సషనల్ హిట్ అయినా 'శివపుత్రుడు', విశాల్‌తో వాడు వీడు, ఇలా ఎన్నో విజయాలు అందుకున్న బాల గారు జ్యోతికతో 'నాచియార్' సినిమా తీశారు.ఈ సినిమాలో జ్యోతిక ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనబడుతుంది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం మరో హైలైట్. ఈ చిత్రంలో హీరో జీవీ ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు.

ఈ సందర్భంగా నిర్మాతలు కోనేరు కల్పన మాట్లాడుతూ "నాచియార్ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. జ్యోతిక తెలుగులో కొంత కాలం గ్యాప్ తరువాత వస్తున్న ఈ చిత్రాన్ని విడుదల చేయటం మాకు చాల ఆనందంగా ఉంది. బాల గారి అద్భుతమైన దర్శకత్వం ఒక్క ఎత్తు అయితే జ్యోతిక గారి నటన మరో ఎత్తు. వీరి ఇద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా తమిళనాడు అంతటా విజయవంతంగా ప్రదర్శింపబడినది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఆగష్టు 17న విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో ఎంతో విజయం సాధించిన ఈ సినిమాపై తెలుగులో అంచనాలు భారీగా ఉన్నాయ్. బయర్లు మరియు డిస్ట్రిబ్యూటర్‌ల దగ్గర నుంచి మంచి ఆఫర్ వస్తుంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది" అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com