రిలీజ్ కు ముందే లీకైన గీతా గోవిందం

- August 12, 2018 , by Maagulf
రిలీజ్ కు ముందే లీకైన గీతా గోవిందం

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత పరశురాం డైరక్షన్ లో చేసిన సినిమా గీతా గోవిందం. ఆగష్టు 15న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ముందే లీక్ అవడం ఇప్పుడు అంతటా సంచలనంగా మారింది.

గుంటూరులో 17 మంది విద్యార్ధుల దగ్గర గీతా గోవిందం సినిమా ఉంది. యూట్యూబ్ లో కూడా లీక్ చేసినట్టు తెలుస్తుంది. వాట్స్ యాప్ లో కూడా ఈ సినిమాను షేర్ చేసుకున్నారట. గీతా గోవిందం లీక్ పై అప్రమత్తమైన చిత్ర దర్శక నిర్మాతలు వెంటనే ఆ లింక్ ను డిలీట్ చేశారు.

అంతేకాదు ఈ లీకేజ్ కు కారణమైన వారిని అరెస్ట్ చేయించారట. స్టార్ హీరో సినిమా లీక్ అవడం చూశాం కాని విజయ్ సినిమా లీక్ పై ఇంత హంగామా నడవడం అతనికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తుంది. తన ఫ్యాన్స్ ను రౌడీస్ అని పేరు పెట్టిన విజయ్ ఆ రౌడీల వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తుంది.

అప్పట్లో అత్తారింటికి దారేది సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లీక్ అయ్యింది. అయితే గీతా గోవిందం సినిమా మొత్తం లీక్ చేశారా లేక కొన్ని సీన్స్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించింది. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచగా యూత్ లో ఈ సినిమాకు ఉన్న బజ్ ఏంటన్నది సినిమా లీకుని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com