ఇండిపెండెన్స్‌ డే: బహ్రెయిన్‌లో మెగా మెడికల్‌ క్యాంప్‌

- August 12, 2018 , by Maagulf
ఇండిపెండెన్స్‌ డే: బహ్రెయిన్‌లో మెగా మెడికల్‌ క్యాంప్‌

ఇండియన్‌ క్లబ్‌, షిఫా అల్‌ జజీరా మెడికల్‌ సెంటర్‌తో కలిసి మెగా మెడికల్‌ క్యాంప్‌ని భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించనుంది. ఆగస్ట్‌ 17, శుక్రవారం రోజున ఇండియన్‌ క్లబ్‌ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించబడ్తుంది. షిఫా అల్‌ జజీరా మెడికల్‌ సెంటర్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సల్మాన్‌ ఘరీబ్‌ మాట్లాడుతూ, షిఫా అవసరమైన స్పెషాలిటీ సర్వీసెస్‌ని ఒకే చోట అందజేయబోతోందనీ, ఇండియన్‌ క్లబ్‌ మెంబర్స్‌, వారి కుటుంబ సభ్యులు, అలాగే జనరల్‌ పబ్లిక్‌కి ఈ సేవలు అందిస్తామని చెప్పారు. 2004 నుంచి షిఫా అల్‌ జజీరా మెడికల్‌ సెంటర్‌ పలు మెడికల్‌ క్యాంప్స్‌ని నిర్వహిస్తూ వస్తోంది. కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిర్వహిస్తోన్న ఈ మెడికల్‌ క్యాంప్స్‌కి మంచి స్పందన లభిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com