ఇండిపెండెన్స్ డే: బహ్రెయిన్‌లో మెగా మెడికల్ క్యాంప్
- August 12, 2018
ఇండియన్ క్లబ్, షిఫా అల్ జజీరా మెడికల్ సెంటర్‌తో కలిసి మెగా మెడికల్ క్యాంప్‌ని భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించనుంది. ఆగస్ట్ 17, శుక్రవారం రోజున ఇండియన్ క్లబ్ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించబడ్తుంది. షిఫా అల్ జజీరా మెడికల్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సల్మాన్ ఘరీబ్ మాట్లాడుతూ, షిఫా అవసరమైన స్పెషాలిటీ సర్వీసెస్‌ని ఒకే చోట అందజేయబోతోందనీ, ఇండియన్ క్లబ్ మెంబర్స్, వారి కుటుంబ సభ్యులు, అలాగే జనరల్ పబ్లిక్‌కి ఈ సేవలు అందిస్తామని చెప్పారు. 2004 నుంచి షిఫా అల్ జజీరా మెడికల్ సెంటర్ పలు మెడికల్ క్యాంప్స్‌ని నిర్వహిస్తూ వస్తోంది. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిర్వహిస్తోన్న ఈ మెడికల్ క్యాంప్స్‌కి మంచి స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..