ప్రాణాలుతీసే మరో ‘బ్లూవేల్’ తరహా గేమ్.. మీ పిల్లలు జాగ్రత్త!
- August 13, 2018
సరదాగా ఆడుకోవాల్సిన గేమ్‌లు కూడా ప్రాణాలు తీస్తున్నాయి. మొన్నటి వరకు భయపెట్టిన బ్లూవేల్ మానియా తగ్గింది కదా అనుకుంటే మరో కొత్త గేమ్ వచ్చింది అదే మోమో ఛాలెంజ్. ఇప్పటికే ఈ గేమ్ బారిన పడి ఒకరిద్దరు మృత్యువాత పడ్డారు. సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో వ్యాపిస్తున్న ఈ గేమ్ యూకే, మెక్సికో, అర్జెంటీనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో విస్తరించింది. ప్రత్యేక లింక్‌ల ద్వారా భారత్‌కి కూడా వ్యాపించింది.
ఈ గేమ్‌లో కూడా బ్లూవేల్ తరహాలోనే కొన్ని టాస్కులు చేయవలసి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే కొత్త కొత్త నంబర్ల నుంచి భయంకరమైన వీడియోలు, బెదిరింపులు వస్తుంటాయి. భయంకరంగా ఉన్న శరీర ఆకృతి, పెద్ద పెద్ద కళ్లతో ఉన్న విచిత్ర ఆకారం పేరే ‘మోమో’. జపాన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్ ద్వారా ఈ ఇమేజ్‌ని రూపొందిస్తే మరో కంపెనీ దీన్ని వాడుకుంది మోమో గేమ్ కోసం. అర్జెంటీనాకు చెందిన ఓ చిన్నారి ఇప్పటికే ఈ గేమ్‌కు బలైంది. తన వాట్సాప్‌లో గేమ్‌కు సంబంధించిన వీడియోలు వుండడంతో ఈ గేమే ఆమె ప్రాణాలు తీసిందని నిర్ధారించుకున్నారు పోలీసులు. టీనేజ్ యువతీ యువకులను టార్గెట్ చేసి రూపొందించిన ఈ గేమ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







