జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మోదీ
- August 14, 2018దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా ఈ పథకాన్ని మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 25వ తేదీ (పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి) నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్యసాయం అందిస్తామన్నారు.
తొలివిడతగా దేశంలోని 10 కోట్ల మందికి వర్తింపజేస్తామన్న ఆయన.. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని.. అవసరమైన సిబ్బంది, సదుపాయాలు కల్పిస్తామని మోదీ చెప్పారు. గడిచిన రెండేళ్లలో 5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారని మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ వల్ల దేశంలోని ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు రక్షించామని, మూడు లక్షల మందికి స్వచ్ఛ భారత్ రక్షించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO ) తెలిపిందని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల