వ్యోమగామిగా వరుణ్ తేజ్.. టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల

- August 14, 2018 , by Maagulf
వ్యోమగామిగా వరుణ్ తేజ్.. టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల

'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అంతరిక్ష కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. 'అంతరిక్షం 9000KMPH' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ ఫస్ట్‌లుక్‌లో వరుణ్ తేజ్ వ్యోమగామిగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అదితీ రావు హైదారీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రిష్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com