మస్కట్‌:కారు ప్రమాదంలో ఏడుగురు మృతి

- August 15, 2018 , by Maagulf
మస్కట్‌:కారు ప్రమాదంలో ఏడుగురు మృతి

మస్కట్‌:అల్‌ వుస్తాలో జరిగిన కారు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా సౌదీ జాతీయులని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొనడం జరిగింది. రెండు కార్లు విలాయత్‌ ఆఫ్‌ హైమాలో ఢీకొన్నాయనీ, ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. గాయపడ్డవారిని హైమా ఆసుపత్రికి తరలించినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. అల్‌ వుస్తా గవర్నరేట్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com