నార్కోటిక్ పిల్స్‌తో పట్టుబడ్డ బహ్రెయినీ
- August 15, 2018
బహ్రెయిన్:28 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 133 నార్కోటిక్ పిల్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో నిందితుడు, అబ్‌నార్మల్ స్టేట్‌లో పోలీసులకు చిక్కాడు. అనుమానాస్పదంగా నిందితుడు కన్పించాడనీ, ఆ సందర్భంలో అతని చేతిలో ఓ గ్లాస్ బాక్స్ వుందనీ, దాన్ని తనిఖీ చేస్తే అందులో 133 నార్కోటిక్ పిల్స్, హాషిష్ దొరికాయని విచారణాధికారులు వెల్లడించారు. నిందితుడిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, అతన్ని కోర్టులో హాజరు పరిచారు. పలు రకాలైన డ్రగ్స్‌కి సంబంధించి ఆయనపై పరీక్షలు జరపగా, వాటిల్లో పాజిటివ్ అని తేలింది. నిందితుడిపై డ్రగ్స్ సేవించినందుకు కూడా కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







