కేరళ:ప్రమాదకర స్థాయికి చేరుకున్న ముళ్లపెరియార్‌ డ్యాం

- August 15, 2018 , by Maagulf
కేరళ:ప్రమాదకర స్థాయికి చేరుకున్న ముళ్లపెరియార్‌ డ్యాం

కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చెస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నిరాశ్రయిలుగా మారుతున్నారు. భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు 30 డ్యాములు నిండు కుండాల మారాయి. దీంతో డ్యాములు ప్రమాద ఘంటికలు మెగిస్తున్నాయి.

మరోవైపు పెరియార్ నదిపై ఉన్న పురాతన ముళ్లపెరియార్‌ డ్యామ్‌కు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయి.ప్రమాద స్థాయికి చేరింది. ముళ్లపెరియార్‌ డ్యామ్‌ ఎత్తు 142 అడుగులు. డ్యామ్‌‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం మధ్యాహ్నానికి 142 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో అధికారులు ప్రమాద హేచ్చరికలు జారి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com