లీడ్‌లెస్‌ పేస్‌మేకర్‌: ఒమన్‌లో తొలిసారి

- August 15, 2018 , by Maagulf
లీడ్‌లెస్‌ పేస్‌మేకర్‌: ఒమన్‌లో తొలిసారి

మస్కట్‌:ఒమన్‌లో తొలిసారిగా లీడ్‌లెస్‌ పేస్‌మేకర్‌ని సర్జరీలో వినియోగించారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. రాయల్‌ హాస్పిటల్‌లో ఈ సర్జరీ జరిగింది. సంప్రదాయ పేస్‌మేకర్లతో పోల్చితే, లీడ్‌లెస్‌ పేజ్‌మేకర్‌కి కనెక్టింగ్‌ వైర్స్‌ లేదా జనరేటర్‌ అవసరం వుండదు. సంప్రదాయ పేస్‌ మేకర్‌ని అమర్చే సమయం కంటే తక్కువ సమయంలోనే ఈ లీడ్‌లెస్‌ పేస్‌మేకర్‌ని అమర్చవచ్చు. రాయల్‌ హాస్పిటల్‌లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కార్డియాక్‌ సర్జరీ 'లీడ్‌లెస్‌ పేస్‌ మేకర్‌' సర్జరీని తొలిసారిగా ఒమన్‌లో నిర్వహించిందని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com