పంద్రాగష్టుకు లండన్‌లో భారత పతాకావిష్కరణ
- August 15, 2018
లండన్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌లో ఉన్న టీమిండియా బ్రిటన్ రాజధాని లండన్‌లో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నాటింగ్హామ్కు బయలుదేరే ముందు హోటల్ బయటకు వచ్చిన ఆటగాళ్లంతా ఒకే చోటకు చేరారు. పతకావిష్కరణ కాగానే జాతీయగీతం ఆలపించారు. 'భారత క్రికెట్ జట్టు తరఫున ఇక్కడి నుంచి ప్రతీ ఒక్కరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్' అని కోహ్లీ పేర్కొన్నాడు.
రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తదితరులు జెండా ముందు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 'భారతీయుడిని కావడం గర్వకారణం. నా మువ్వన్నెల జెండా ఎప్పుడూ ఆకాశంలో అత్యంత ఎత్తున ఉండాలి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, జైహింద్' అని కుల్దీప్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. 'స్వాతంత్ర్యమంటే మెరుగ్గా ఉండేందుకు మరో అవకాశం' అని ట్వీట్ చేశాడు.
జట్టు సంబరాలు చేసుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టీమిండియా శ్రీలంకలో చేసుకుంది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 0-2తో వెనకబడిన కోహ్లీసేన ఆగష్టు నెల 18 నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టు కోసం భారత జట్టు బుధవారం నాటింగ్‌హామ్ బయలుదేరింది.
రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో జట్టులో కీలక మార్పులుంటాయని భావిస్తున్నారు. ఓ వైపు ప్రాక్టీసును ముమ్మరం చేసిన భారత్.. మరో వైపు జట్టు కూర్పు విషయంలోనూ తర్జనభర్జనలు పడుతోంది. రెండో టెస్టులో 159 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో జట్టును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అన్నీ తానై నడిపించిన కెప్టెన్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టులో సరిగా ప్రదర్శించలేకపోయాడు. మూడో టెస్టులోనైనా రాణిస్తేనే విజయంపై ఆశలు సజీవంగా ఉంటాయని సీనియర్ క్రికెటర్లతో పాటు సగటు అభిమాని కోరుకుంటున్నాడు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్‌పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







